కన్నుల పండవగా వెంకన్న కల్యాణం

ABN , First Publish Date - 2020-12-28T05:04:19+05:30 IST

తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదం డరామస్వామి ఆలయాల్లో ఆదివారం వెంకటేశ్వరస్వామివారి కల్యా ణం కన్నుల పండువగా నిర్వహించారు

కన్నుల పండవగా వెంకన్న కల్యాణం

గరుగుబిల్లి, డిసెంబరు 27: తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదం డరామస్వామి ఆలయాల్లో ఆదివారం వెంకటేశ్వరస్వామివారి కల్యా ణం కన్నుల పండువగా నిర్వహించారు. ముందుగా ఉభయ దేవా లయాల్లో ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు వీవీ అప్పలా చార్యులు, పి.గోపాలకృష్ణమాచార్యులు, కె.శ్రీనివాసాచార్యులు నిర్వ హించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడు మ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్‌ మాట్లాడుతూ స్వామివారి కల్యాణానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, గతంలో కంటే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. నిత్య అన్నదానానికి పలువురు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. కల్యాణానికి హాజరైన భ క్తులకు పార్వతీపురానికి చెందిన ఆర్నిపల్లి అర్జునరావు, తోట పల్లికి చెందినప్రసాదరావు దంపతులు అన్న సమారాధన నిర్వహించారు.


Updated Date - 2020-12-28T05:04:19+05:30 IST