దర్యాప్తు అనంతరం చర్యలు చేపడతాం
ABN , First Publish Date - 2020-11-26T05:37:17+05:30 IST
జిల్లాలోని గుర్ల మండలం దేవునికణపాక ప్రభుత్వ భూముల అక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులకు ప్రొక్లేన్‌లను అప్పగించలేదని విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్
విజయనగరం క్రైం: జిల్లాలోని గుర్ల మండలం దేవునికణపాక ప్రభుత్వ భూముల అక్రమణ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులకు ప్రొక్లేన్‌లను అప్పగించలేదని విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ భూముల అక్రమణల విషయంలో ఉన్న వాహనాలను స్వయంగా సీజ్ చేసుకునేందుకు పోలీసు అధికారులకు నేరుగా చట్ట ప్రకారం వీల్లేదని రెవెన్యూ అధికారుల సీజర్ నివేదిక ప్రకారం మాత్రమే స్వాధీనం పరుచుకునే వీలుంటుందన్నారు. గుర్ల తహసీల్దారు చెప్పినట్టుగానే ప్రొక్లెన్లను పోలీసు అధికారులకు అప్పగించలేదన్నారు. భూముల అక్రమణల వ్యవహారంలో గుర్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని నింది తులపై చట్టప్రకారం కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కేసు నమోదు విష యంలో అలసత్వంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు.