-
-
Home » Andhra Pradesh » Vizianagaram » We will protect Maharaja College
-
మహారాజా కళాశాలను కాపాడుకుంటాం
ABN , First Publish Date - 2020-12-07T04:41:53+05:30 IST
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో మహారాజా కళాశాలను కాపాడుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్, జిల్లా కార్యదర్శి కె.రామ్మోహన్ తెలిపారు.

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో మహారాజా కళాశాలను కాపాడుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్, జిల్లా కార్యదర్శి కె.రామ్మోహన్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎంఆర్ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు అండగా నిలిచిన కళాశాలను మాన్సాస్ యాజమాన్యం ప్రైవేటీకరణ చేస్తా మని ప్రతిపాదించడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రతి నిధులు వెంకటేష్, రాము, సతీష్, హర్ష, రామకృష్ణ, పావనీ, సతీష్ పాల్గొన్నారు.