15లోగా మరుగుదొడ్లు పూర్తి చేస్తాం

ABN , First Publish Date - 2020-03-21T10:22:10+05:30 IST

జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన మరుగుదొడ్లు నిర్మాణాలు వచ్చేనెల 15లోగా పూర్తి చేస్తామని కలెక్టర్‌

15లోగా మరుగుదొడ్లు పూర్తి చేస్తాం

విజయనగరం, మార్చి 20: జిల్లాలో నూతనంగా మంజూరు చేసిన మరుగుదొడ్లు నిర్మాణాలు వచ్చేనెల 15లోగా పూర్తి చేస్తామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ ఆదనపు కార్యదర్శి అరుణ్‌ బరోకా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 16,603 మరుగుదొడ్లు మంజూరు చేయగా, 2500 పూర్తి చేశామని, 3530 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. గ్రామ సచివాలయాలకు ఇంజినీరింగ్‌ సిబ్బందిని నియామకాలు చేశామని, వారిని ఈ పనులు పూర్తిస్థాయిలో వినియోగిస్తామన్నారు. కార్యదర్శి బరోకా మాట్లాడుతూ, జనాభా లెక్కలు ప్రారంభమయ్యే నాటికి శతశాతం మరుగుదొడ్లు ఉన్న కుటుంబాలుగా నమోదు కావాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పి.రవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-21T10:22:10+05:30 IST