తాటిపూడి రిజర్వాయర్‌ను నీటిని పరిరక్షించాలి

ABN , First Publish Date - 2020-03-21T10:12:39+05:30 IST

తాటిపూడి రిజర్వాయర్‌లో నీటిని పరిరక్షించాలని ఆయకట్టుదారులు శుక్రవారం కలెక్టరు హరి జవహర్‌లాల్‌కు విన్నవించుకున్నారు. సుమారు 15,366 ఎకరాలకు

తాటిపూడి రిజర్వాయర్‌ను నీటిని పరిరక్షించాలి

గంట్యాడ, మార్చి 20: తాటిపూడి రిజర్వాయర్‌లో నీటిని పరిరక్షించాలని ఆయకట్టుదారులు శుక్రవారం కలెక్టరు హరి జవహర్‌లాల్‌కు విన్నవించుకున్నారు. సుమారు 15,366 ఎకరాలకు సాగు అందిస్తున్న రిజర్వాయర్‌లో నీరు వృథా కాకుండా అరికట్టాలని కోరారు. సిబ్బంది లేకపోవడంతో ఎలక్ర్టీషన్‌, హెల్పర్స్‌, లస్కర్లు తదితర పోస్టులు భర్తీ చేయాలన్నారు. రిజర్వాయర్‌ పరిధిలో గల సాగు నీటి కాలువులకు సిమెంట్‌ లైనింగ్‌ నిర్మించాలని కోరారు.


విశాఖపట్టణానికి సరఫరా అవుతున్న తాగునీటికి పైపులైన్‌ వద్ద 11 ఎంజీడీ కొలత పరికరం ఏర్పాటు చేయాలన్నారు. గతంలో వచ్చిన పొరపాట్లు తిరిగి పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ వాసులకు తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని, తాటిపూడిని పూర్తిగా సాగునీటి ప్రాజెక్టుగా ప్రకటించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు బి.రాంబాబు, ఎల్‌.ఆదినారాయణ, మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T10:12:39+05:30 IST