‘వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పరిరక్షించాలి’

ABN , First Publish Date - 2020-03-04T10:54:38+05:30 IST

జిల్లాలో ఉన్న వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని బోర్డు అధ్యక్షుడు ఎస్‌కేఎం భాషా, ముస్లిం సోదరులు

‘వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పరిరక్షించాలి’

విజయనగరం రూరల్‌, మార్చి 3: జిల్లాలో ఉన్న వక్ఫ్‌ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని బోర్డు అధ్యక్షుడు ఎస్‌కేఎం భాషా, ముస్లిం సోదరులు కోరారు. మంగళవారం విజయనగరం వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో నోడల్‌ అధికారి షరీఫ్‌నకు వినతిపత్రం అంద జేశారు. విజయనగరం నగరపాలక సంస్థ మస్తాన్‌ వీధి ముస్లిం శ్మశాన వాటికలో టీఎస్‌ నెం:867లో 200 గజాల స్థలం ఆక్రమణకు గురైందని, అదేవిధంగా టీఎస్‌ఏ నెం:868లో స్థలం ఆక్రమణకు గురైందన్నారు. విజయనగరం మండలం జమ్ము నారాయణపురం పంచాయతీ సర్వే నెం.140/10ఎలోని 92 సెంట్లు విక్రయించారని పేర్కొన్నారు. కంటోన్మెంట్‌ తెలకలవీధిలో ముస్లిం శ్మశానవాటికలో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. జూట్‌మిల్లు ఎదురుగా ఉన్న స్థలంలో కూడా పక్కా నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకుని, బోర్డుకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. 

Updated Date - 2020-03-04T10:54:38+05:30 IST