అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యా యత్నం
ABN , First Publish Date - 2020-10-28T07:53:27+05:30 IST
పట్టణంలోని జగన్నాథపురానికి చెందిన మజ్జి రాము అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

బెలగాం: పట్టణంలోని జగన్నాథపురానికి చెందిన మజ్జి రాము అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఏరియా ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గత కొద్ది కాలం కిందట రాము స్థానిక పరిచయస్థుల నుంచి రూ.15 వేలను అప్పుగా తీసుకుని, సకాలంలో చెల్లించలేకపోయాడు. వారు సోమవారం రామును నడి రోడ్డుపై దుర్భాషలాడి అప్పు చెల్లించమని అడిగారు. దీంతో ఆయన మనస్థాపానికి గురై విషం తాగాడు. బంధువులు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.