రైతు భరోసాకు రూ.116.398 కోట్లు
ABN , First Publish Date - 2020-10-28T07:51:39+05:30 IST
రైతు భరోసా పథకం కింద రెండో విడతగా జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల మంది రైతులకు రూ.116.398 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్
కలెక్టరేట్, అక్టోబరు 27: రైతు భరోసా పథకం కింద రెండో విడతగా జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల మంది రైతులకు రూ.116.398 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాకు మంగళవారం నిధులు జమ చేశారు. మొదటి విడతగా జిల్లాలో 2.74 లక్షల మంది రైతులకు 152.74 కోట్లను అందజేశారు. రెండు విడతలు కలిపి రూ.269.138 కోట్లు జమ చేసినట్లయింది. కొత్త లబ్ధిదారుల్లో అటవీ భూములపై హక్కులు పొందిన రైతులు కూడా ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సీ సురేష్ బాబు, ఎంఎల్ఏలు శంబంగి చినఅప్పలనాయుడు, బి.అప్పలనాయుడు, అలజంగి జోగారావు, జేసీ కిషోర్, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి తదితరులు ఉన్నారు.