కృషి ఫలించిన వేళ ...
ABN , First Publish Date - 2020-10-28T07:49:20+05:30 IST
జల సంరక్షణలో జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటించింది.

జలసంరక్షణలో జిల్లాకు జాతీయ అవార్డు
కలెక్టరేట్, అక్టోబరు 27: జల సంరక్షణలో జిల్లాకు జాతీయ అవార్డు లభించింది. కేంద్ర జలశక్తి శాఖ ఈ విషయాన్ని మంగళవారం సాయంత్రం ప్రకటించింది. కలెక్టర్ హరిజవహర్‌లాల్ చెరువుల శుద్ధి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 5గంటలకు చెరువుల శుద్ధి కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు. ఆయన పిలుపుతో జిల్లా వ్యాప్తంగా 1500కు పైగా చెరువులను స్థానికులే స్వచ్ఛందంగా శుభ్రపరిచారు. జిల్లా కేంద్రంలో దాదాపు 22 చెరువుల రూపు మార్చారు. గట్లను వాకింగ్ ట్రాక్‌లుగా తీర్చిదిదారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం జాతీయ అవార్డును ప్రకటించింది.