వైభవ్‌ జ్యూయలర్స్‌ షోరూం ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-27T09:11:46+05:30 IST

నగరం లోని డాబాతోట వద్ద వైభవ్‌ జ్యూయలర్స్‌ 13వ షోరూంను ఆదివారం ప్రారంభిం చారు. తొలుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు.

వైభవ్‌ జ్యూయలర్స్‌ షోరూం ప్రారంభం

విజయనగరం రింగురోడ్డు: నగరం లోని డాబాతోట వద్ద వైభవ్‌ జ్యూయలర్స్‌ 13వ షోరూంను ఆదివారం ప్రారంభిం చారు. తొలుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌,  మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇటువంటి షోరూంలు నగరంలో ఏర్పాటు కావడం వల్ల  ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. అదే విధంగా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా బంగారు ఆభరణాలు విభిన్నమైన మోడల్స్‌లో దొరుకుతాయన్నారు. వెండి, బంగారం వంటి అన్ని రకాల వస్తువులు ఒకేచోట కొనుక్కోవచ్చని తెలిపారు.


సంస్థ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) జె. రఘునాథ్‌ మాట్లాడుతూ.. 916హాల్‌మార్క్‌ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్‌ డైమండ్స్‌, ఫైన్‌ జ్యూయలరీ, 925 స్వచ్ఛత కలిగి వందశాతం తిరిగి కొనుగోళ్లు హామీ కలిగిన స్టెర్లింగ్‌ సిల్వర్‌ ఆభరణాలు అందించనున్నామని తెలిపారు. ప్రారంభోత్సవ కానుకగా బంగారు ఆభరణాల తరుగుపై 25 శాతం తగ్గింపు, రూ.10 వేల తగ్గింపుతో ప్రతి క్యారట్‌ డైమండ్‌, నగలు,  కిలో వెండి వస్తువుల పై రూ.1,500 తగ్గింపును ఈనెలాఖరు  వరకూ అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం లో వైభవ్‌ సంస్థల సీఎండీ మల్లికా మనోజ్‌ గ్రంథి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమరేంద్ర గ్రంఽథి, సీఈవో ఆర్‌.సతీష్‌, డైరెక్టర్‌ కీర్తన, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు సీతారామమూర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T09:11:46+05:30 IST