సమస్యలపై వినతులు

ABN , First Publish Date - 2020-10-27T09:09:15+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన జీవోను సవరించాలని యూటీఎఫ్‌ నాయకులు ఎమ్మెల్యే శంబంగికి వినతిపత్రం అందజేశారు.

సమస్యలపై వినతులు

బొబ్బిలి: ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అసంబద్ధమైన జీవోను సవరించాలని యూటీఎఫ్‌ నాయకులు   ఎమ్మెల్యే శంబంగికి వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్‌ నేతలు విజయగౌరి,   పకీరు నాయుడు, రమేష్‌, శ్రీనివాస్‌, చిట్టిబాబు, వేణుగోపాల్‌, శారదారాణి, కృష్ణదాసు, రాధాకృష్ణ పాల్గొన్నారు. ఫ గ్రోత్‌సెంటర్‌లో  పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని కట్టడి చేయాలని ఎం.బూర్జవలస గ్రామస్థులు ఎమ్మెల్యే శంబంగికి వినతిపత్రం అందజేశారు. కాలుష్యం  కారణంగా ఎం.బూర్జి వలస, ఎం.పనుకువలస, మెట్ల వలస, గొర్లె సీతారాంపురం, గున్న తోటవలస, నారాయణప్ప వలస, ఐటీఐ కాలనీ, పెంట, ఇందిరమ్మ కాలనీ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పశువులకు నష్టం వాటిల్లుతోందని, చెరువుల్లో చేపలు చనిపోతున్నా యని గ్రామ ప్రతి నిధులు తెలిపారు.  స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వాపో యారు.  వైసీపీ నేత శ్రీనివాసరావు, సీపీఎం నేతలు గోపాలం, అప్పల నాయుడు, అబ్దుల్‌ కలాం యూత్‌ అసోసియే షన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T09:09:15+05:30 IST