ప్రజలకు అందుబాటులో ఉండాలి

ABN , First Publish Date - 2020-10-13T09:26:07+05:30 IST

ప్రజల కు అందుబాటులో ఉండి చక్కని సేవ లు అందజేయాలని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. రామవరం గ్రామ సచి వాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ 



గంట్యాడ, అక్టోబరు 10: ప్రజల కు అందుబాటులో ఉండి చక్కని సేవ లు అందజేయాలని సచివాలయ సిబ్బందికి కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. రామవరం గ్రామ సచి వాలయాన్ని ఆయన సోమవారం  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసంద ర్భంగా ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిశీలించారు. జూనియర్‌ లైన్‌మన్‌ హాజరు పట్టిలో సంతకం చేయకపోవడంపై ప్రశ్నించారు. క్షేత్ర పర్యనటకు వెళ్లడం వల్ల సంతకం చేయలేదని జేఎల్‌ఎం అఖిల్‌ వివరణ ఇచ్చారు. ప్రజలకు అందు బాటులో ఉండటం లేదంటూ ఫిర్యాదు వస్తున్నాయని, విద్యుత్‌ ఏఈ కృష్ణ మూర్తికి ఫోన్‌ చేసి తెలిపారు.


ఈసందర్భంగా ఏఈ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం గ్రామంలో రైస్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న బి.ఎర్రమ్మ అనే మహిళకు రైస్‌ కార్డు మంజూరు చేశారు. సచివాలయం ఆవరణను పరిశీలించి, మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ కనకల స్వర్ణకుమార్‌, ఎంపీడీవో నిర్మాలాదేవి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-13T09:26:07+05:30 IST