ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2020-10-07T10:25:30+05:30 IST

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

విజయనగరం రూరల్‌ : విజయనగరంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు మంగళవారం దాడులు చేశారు. విజిలెన్స్‌ డీఎస్పీ ఎ.నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో స్థానిక ఏవో ఎం.ఉమామహేశ్వర నాయుడుతో పాటు, పలువురు వ్యవసాయశాఖాధికారులు పాల్గొన్నారు. అవంతి వేర్‌హౌస్‌ హోల్‌సేల్‌ షాపులో ఫారం జీరో గడువు తేది అయిపోయినా యూరియా అమ్మకాలు జరిగినట్టు నిర్ధారించారు. మరికొన్ని దుకాణాల్లో రికార్డులు పరిశీలించారు.

Read more