దత్తిలో తొమ్మిది మందికి..

ABN , First Publish Date - 2020-10-04T10:58:17+05:30 IST

దత్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

దత్తిలో తొమ్మిది మందికి..

దత్తిరాజేరు అక్టోబరు 3:దత్తి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. గత నెల 25, 29 తేదీల్లో పాఠశాలలో 120 మంది విద్యార్థులు, పది మంది ఉపాధ్యాయులకు దత్తిరాజేరు పీహెచ్‌సీ సిబ్బంది వైరస్‌ నిర్థారణ పరీక్షలు చేశారు. వాటి ఫలితాలు శనివారం వచ్చాయి. మొత్తం తొమ్మిది మందికి వైరస్‌ నిర్థారణ అయినట్టు వైద్యాధికారి ఆనంద్‌కుమార్‌ ధ్రువీకరించారు.


ఇందులో ఇద్దరు విద్యార్థులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. మిగతా ఏడుగురిని జేఎన్‌టీయూ ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులకు నిర్థారణ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు.  విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలియడంతో బాధిత గ్రామాల్లో ఆందోళన నెలకొంది. 

Updated Date - 2020-10-04T10:58:17+05:30 IST