భార్య కాపురానికి రాలేదన్న మనస్థాపంతో..

ABN , First Publish Date - 2020-10-04T10:47:39+05:30 IST

రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిన భార్య ఎంతకు తిరిగిరాకపోవడాన్ని భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని భీమసింగి పంచాయతీ యాతపా లెంలో చోటుచేసుకుంది.

భార్య కాపురానికి రాలేదన్న మనస్థాపంతో..

 భర్త ఆత్మహత్య



శృంగవరపుకోట రూరల్‌ (జామి), అక్టోబరు 3: రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిన భార్య ఎంతకు తిరిగిరాకపోవడాన్ని భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని భీమసింగి పంచాయతీ యాతపా లెంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. యాతపాలెంకు చెందిన చుక్క అప్పన్న(36)కు విశాఖ జిల్లా ఏటికొప్పాక గ్రామానికి  చెందిన దేవితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు వున్నాడు.


అయితే రెండేళ్ల కిందట వీరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య దేవి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భార్యను రమ్మని ఎన్నోసార్లు కోరాడు. అలాగే పెద్దలను తీసుకెళ్లి మాట్లాడించాడు. అయినా ఆమె రాలేదు. దీంతో చేసేది లేక అప్పన్న నెలరోజుల కిందట తన అత్తవారింటికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం స్వగ్రామానికి వచ్చాడు. అయితే అదేరోజు రాత్రి ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకొని చనిపోయాడు.


శనివారం ఉదయం అప్పన్న తల్లి తన కొడుకును నిద్ర లేపడానికి వెళ్లిన సమయంలో చనిపోయిఉన్నాడు. దీంతో ఆమె లబోదిబోమంటూ గ్రామస్థులకు తెలిపింది. తన కుమారుడిని అత్తింటివారు హింసలు పెట్టడం వల్ల తట్టుకోలేక చనిపోయాడని విలపించింది. అందరితో ఎంతో మంచిగా వుండే అప్పన్న చనిపోవడం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసును జామి పోలీసులు నమోదు చేశారు.

Updated Date - 2020-10-04T10:47:39+05:30 IST