జిల్లా వ్యాప్తంగా ‘ఽథాంక్యూ సీఎం సార్‌’

ABN , First Publish Date - 2020-10-03T10:08:29+05:30 IST

సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తం గా 664 సచివాలయాల పరిధిలో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బంది, వలంటీర్లు, ప్రజా ప్రతినిఽధులు ‘థాంక్యూ సీఎం సార్‌’ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా ‘ఽథాంక్యూ సీఎం సార్‌’

విజయనగరం (ఆంధ్రజ్యోతి): సచివాలయ వ్యవస్థ ఏర్పడి  ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తం గా  664 సచివాలయాల పరిధిలో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బంది, వలంటీర్లు, ప్రజా ప్రతినిఽధులు ‘థాంక్యూ సీఎం సార్‌’ కార్యక్రమం నిర్వహించారు.  959 గ్రామ పంచాయతీలతో పాటు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. 


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల ద్వారా ప్రజలకు పదకొండు శాఖలకు సంబంధించి 150కి పైగా సేవలు అందుతున్నాయన్నారు. దీంతో సచివాలయల పరిధిలో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఇదిలా ఉండగా జిల్లాలో  2,238 మంది గ్రీన్‌ అంబాసీడర్లకు  అధికారులు, ప్రజా ప్రతినిఽధుల ఆధ్వర్యంలో సన్మానించినట్లు చెప్పారు. పారిశుధ్య కార్మికులకు పండ్లు , డ్రైఫ్రూట్స్‌ అందజేశామన్నారు. 

Updated Date - 2020-10-03T10:08:29+05:30 IST