వలంటీర్ల వ్యవస్థ అద్వితీయం

ABN , First Publish Date - 2020-10-03T10:06:43+05:30 IST

గ్రామ, పట్టణ వార్డు వలంటీరు వ్యవస్థ అద్వితీయమని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తెలిపారు. ఆ వ్యవస్థ ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా శుక్రవారం నగరంలో వలంటీర్లు కేక్‌ కట్‌ చేసి ఆయనకు అందిం చారు.

వలంటీర్ల వ్యవస్థ అద్వితీయం

బొబ్బిలి, అక్టోబరు 2:  గ్రామ, పట్టణ వార్డు వలంటీరు వ్యవస్థ అద్వితీయమని ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు తెలిపారు. ఆ వ్యవస్థ ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా శుక్రవారం నగరంలో వలంటీర్లు కేక్‌ కట్‌ చేసి ఆయనకు అందిం చారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ సత్ఫలితాలు  సాధిస్తోందన్నారు. 


పట్టణంలో గ్రీన్‌ అంబాసిడర్లు, గ్రీన్‌ బెల్ట్‌ సొసైటీ ప్రతినిధులు ఎస్‌వీ రమణమూర్తి, కృష్ణదాసు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సత్కరించారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ నాయుడు, వైసీపీ నేతలు, మునిసిపల్‌,  సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:06:43+05:30 IST