సచివాలయాలతో సత్ఫలితాలు : ఎంపీ

ABN , First Publish Date - 2020-10-03T10:05:31+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థతో సత్ఫలితాలు సాధిస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. సీఎం జగన్‌ ప్రజల ముంగి టకే పాలనను తీసుకొచ్చారని చెప్పారు.

సచివాలయాలతో సత్ఫలితాలు : ఎంపీ

 చీపురుపల్లి, అక్టోబరు 2:  ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్థతో సత్ఫలితాలు  సాధిస్తున్నామని  ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు. సీఎం జగన్‌ ప్రజల ముంగి టకే పాలనను తీసుకొచ్చారని చెప్పారు. రూ.40 లక్షలతో పెదనడిపల్లిలో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వ యకర్త మజ్జి శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.   పార్టీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే సమయానికి తోటపల్లి పిల్ల కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచారు. అనంతరం గ్రీన్‌ అంబాసి డర్లను నాయకులు ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమంలో నాబార్డు డైరెక్టర్‌ కేవీ సూర్యనారాయణరాజు, పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పతివాడ రాజారావు,  డీపీవో  సునీల్‌రాజ్‌ కుమార్‌, డీఎల్‌పీవో మోహనరావు, ఎస్‌ఈ రమేష్‌గుప్త, డీఈ శ్రీనివాసరావు, జేఈఈ డి.రమేష్‌, ఎంపీడీవో  రామకృష్ణరాజు, తహసీల్దార్‌  పీవీ శ్యామసుందర రావు పాల్గొన్నారు.


 బొబ్బిలి (తెర్లాం):  తెర్లాం మండలం కొరటాంలో  గ్రామ సచివాలయ భవనాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ప్రారంభిం చారు. అనంతరం ఆయనతో పాటు ఎమ్మెల్యే శంబంగి, వైసీపీ జిల్లా నేత చిన్నశ్రీను, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తదితరులు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. 

Updated Date - 2020-10-03T10:05:31+05:30 IST