పింఛన్ల పంపిణీలో జిల్లా టాప్‌

ABN , First Publish Date - 2020-10-02T09:38:37+05:30 IST

పింఛన్ల పంపిణీలో జిల్లా మళ్లీ టాప్‌గా నిలిచింది. వరుసగా తొమ్మిదో సారి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం 6 గ ంటల నుంచి వలంటీర్లు ద్వారా పింఛన్ల పంపిణీ పక్రియ ప్రారంభమైంది.

పింఛన్ల పంపిణీలో జిల్లా టాప్‌

విజయనగరం (ఆంరఽధ్యజ్యోతి):  పింఛన్ల పంపిణీలో జిల్లా మళ్లీ టాప్‌గా నిలిచింది. వరుసగా తొమ్మిదో సారి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా  గురువారం ఉదయం 6 గ ంటల నుంచి వలంటీర్లు ద్వారా పింఛన్ల పంపిణీ పక్రియ ప్రారంభమైంది. రాత్రి 7 గంటల కి 96.6 శాతంతో రాష్ట్రంలోని జిల్లా ముందంజలో నిలిచింది.


రెండో స్థానంలో కృష్ణా, మూడోస్థానంలో చిత్తూరు, చివరి స్థానంలో ప్రకాశం నిలిచింది. ఇదిలా ఉండగా జిల్లాకు 3లక్షల 36 వేల 697 పింఛన్లు మంజూరు కాగా,  సాయంత్రానికి 3లక్షల 23 వేల 440 పంపిణీ చేశారు. దీనిపై డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు  మాట్లాడుతూ.. పింఛన్ల పంపిణీలో వరుస గా తొమ్మిది సార్లు  జిల్లా ముందంజలో నిలవడం ఆనందంగా ఉందన్నారు.  ఉద్యో గులు, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ రికార్డు సాధ్యమైందన్నారు. కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ వారిని అభినందించారు. 

Updated Date - 2020-10-02T09:38:37+05:30 IST