చికిత్స పొందుతూ బాలుడి మృతి

ABN , First Publish Date - 2020-03-02T10:31:57+05:30 IST

చికిత్స పొందుతూ బాలుడి మృతి

చికిత్స పొందుతూ బాలుడి మృతి

వేపాడ, మార్చి 1: బల్లంకి గ్రామంలో మూడు రోజుల క్రితం చెట్టుపై నుండి జారిపడ్డ బాలుడు మృతిచెందాడు. గ్రామస్థులు, పోలీసులు అందించిన వివరాలు ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఒబ్బిన ఉదయకుమార్‌(16) తండ్రి దేముడుబాబుతో పాటు ఫిబ్రవరి 26న సాయంత్రం గ్రామ సమీపంలోని మామిడి తోటలోకి కర్రల నిమిత్తం వెళ్లారు. ఉదయకుమార్‌ మామిడి చెట్టు ఎక్కి గొడ్డలితో కర్రలు నరుకుతుండగా, ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు విశాఖపట్నం ఆస్పుత్రికి తరలించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. బాలుడు తండ్రి దేముడుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్‌ఐ గొంప రాజేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఉదయకుమారు 9వ తరగతి చదువుతున్నాడు. కన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమునీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-03-02T10:31:57+05:30 IST