పింఛన్లు, రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

ABN , First Publish Date - 2020-03-02T10:31:35+05:30 IST

పింఛన్లు, రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

పింఛన్లు, రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

- మంత్రి బొత్స సత్యనారాయణ 

- పశుసంవర్ధక శాఖ భవనం ప్రారంభం


రింగురోడ్డు, మార్చి1: ఇళ్ల పట్టాలు, రేషన్‌ కార్డులు, పింఛన్ల జారీ ప్రక్రియ నిరంతరం సాగుతుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉగాది రోజున అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. పట్ట ణంలోని గురజాడ అప్పారావు కూడలి సమీ పంలో రూ.5.5 కోట్లతో నూతనంగా నిర్మిం చిన పశుసంవర్థక శాఖ కార్యాలయ భవ నాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించి మా ట్లాడారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఉగాది రోజున రాష్ట్రంలో సుమారు 25లక్షల మందికి, విజ యనగరం జిల్లాలో సుమారు 53 వేల మంది కి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇంటి యజమానురాలు పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు ఇస్తామని తెలిపారు. ఆది వారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశా మన్నారు. జిల్లాలో  34,200 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశా మని తెలిపారు.  కేవలం 5,262 మంది పింఛన్లకు అనర్హులుగా గుర్తిం చామన్నారు. ఇకపై ఇల్లు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసు కోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభఽద్రస్వామి, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, పశుసం వర్థక శాఖ జేడీ ఎంవీఏ నరసింహులు,  డీఈ వెంకటరావు, పంచా యతీరాజ్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌,  పశువైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:31:35+05:30 IST