ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ
ABN , First Publish Date - 2020-03-02T10:30:18+05:30 IST
ప్రతిష్టాత్మకంగా ఇళ్ల స్థలాల పంపిణీ

- బలవంతపు భూసేకరణ లేదు
- సీఎం అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి
- ఎస్.కోట, జామి, విజయనగరంలో లేఅవుట్ల పరిశీలన
శృంగవరపుకోట, మార్చి 1: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంటోందని సీఎం అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి అన్నారు. ఇళ్ల స్థలా లకు సంబంధించి ఎవరి నుంచి కూడా భూము లను బలవంతంగా లాక్కోవడం లేదని తెలి పారు. ఎస్.కోటలోని పుణ్యగిరి రోడ్డులో సర్వే నెంబరు 47లో పేదలకు ఇళ్ల స్థలాలకు ఇచ్చేం దుకు గాను వేసి లేఅవుట్‌ను ఆదివారం ఆయ న కలెక్టర్ హరిజవహర్‌లాల్, అధికారులతో కలిసి పరిశీలించారు. లేఅవుట్ ఎగుడు దిగు డుగా ఉందని, ఉపాధి నిధులు చాలడం లేదని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వారి దృష్టికి తీసుకువచ్చారు. అదనపు నిధులు అందించేం దుకు చర్యలు చేపట్టాలని సీఎం అదనపు కార్య దర్శి కలెక్టర్‌కు ఆదేశించారు. లేఅవుట్‌కు మధ్య లో ఉన్న ఖాళీ స్థలంపై ఆయన తహసీల్దార్‌ను అడిగారు. అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లాడని తహసీల్దార్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. న్యాయపరంగా ఆ స్థలా న్ని స్వాధీనం చేసుకోవాల్సివుందన్నారు. అనంత రం అదనపు సీఎస్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు విజయ నగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉగాదికి పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల స్థితిగతులను పరిశీలిస్తున్నామని తెలి పారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ తామన్నారు. అసైన్డ్ భూములకు గాను ఎక రాకు రూ.2.5లక్షలు పరిహారం ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని సాగు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయంగా స్థలా లు కేటాయిస్తున్నామన్నారు. ఆయన వెంట డ్వామా పీడీ సుబ్బారావు, డీటీ హరి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, తదితర శాఖల అధికారులు ఉన్నారు.
శృంగవరపుకోట రూరల్ (జామి):పేద లకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని సీఎం అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి అన్నారు. అలమండలోని లేఅవుట్‌ను ఆయన సందర్శిం చారు. ఇక్కడ 177 మందికి ఇంటి స్థలాలను కేటాయించనున్నామని మండల అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, కలెక్టర్ హరిజవహర్‌లాల్, అధికారులు ఉన్నారు.
విజయనగరం రూరల్: విజయనగరం మండలంలోని కోరుకొండ, గుంకలాం గ్రామా ల్లోని లేఅవుట్లను సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి పరిశీలించారు. మండలంలో 15 లేఅవుట్లకు గాను పది లేఅవుట్లు సిద్ధం కాగా, మరో ఐదు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది రోజున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఉండాలన్న మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ హరిజవహర్‌లాల్, జేసీ కిశోర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.