దాతల స్పందన.. పేదలకు సాంత్వన

ABN , First Publish Date - 2020-05-09T09:31:58+05:30 IST

స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం 300 మంది అయ్యప్ప స్వాములు, పేదలకు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌

దాతల స్పందన.. పేదలకు సాంత్వన

చీపురుపల్లి, మే 8: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం 300 మంది అయ్యప్ప స్వాములు, పేదలకు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ కూరగాయలు పంపిణీ చేశారు. రమణగురు స్వామి వాటిని సమకూర్చారు.  నాయకులు ఇప్పిలి అనంతం, పతివాడ రాజారావు, వలిరెడ్డి శ్రీను, రవీంద్రనాయుడు, విశ్వేశ్వరరావు, పొదిలాపు వెంకటరావు, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. ఫ విజయనగరం దాసన్నపేట: నగరంలోని ఒకటో డివిజన్‌ వేణుగోపాలపురం, లంకాపట్టణం ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. కేవీఆర్‌ ఎస్టేట్‌ అధినేత వెంకటరెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తవిటిరాజు, ముచ్చు శ్రీనివాసరావు, ఎస్‌వీవీ రాజేష్‌, శంకర్‌, అచ్చిరెడ్డి,  మధు తదితరులు పాల్గొన్నారు.  వైసీపీ జిల్లా  వ్యవహారాల సమన్వయకర్త చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర ప్రదీప్‌నగర్‌లోని ఆమె నివాసంలో వంద మంది పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్‌లు పంపిణీ చేశారు. 


విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన దివిస్‌ లేబరేటరీస్‌ యాజమాన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజ కుమారిని కలిసి 200 టోపీలు, 200 హెండ్‌ గ్లౌజ్‌లు అందజేసింది. దివిస్‌ లేబరేటరీస్‌ సీఎస్‌ఆర్‌ మేనేజరు సురేష్‌కుమార్‌, సంస్థ ప్రతినిధులు నవీన్‌కుమార్‌, మహేంద్ర, పైడినాయుడు, డీఎస్పీ వీరాంజనేయరెడ్డి   ఉన్నారు. ఫవిజయనగరం రింగురోడ్డు: క్రైడాయ్‌ బిల్డర్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో జొన్నగుడ్డిలో 1500 మంది పేద కుటుంబాలకు నిత్యా వసర సరుకులు పంపిణీ చేశారు. అసోసియేషన్‌ ప్రతినిధులు చంద్రబోస్‌, పార్థసారఽథి, సూర్యనారాయణరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T09:31:58+05:30 IST