ఇంటింటా సర్వే!

ABN , First Publish Date - 2020-05-09T09:29:52+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైన చిలకలపల్లిలో ఇంటింటా సర్వే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.

ఇంటింటా సర్వే!

వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ముమ్మరం

భద్రత కట్టుదిట్టం


బలిజిపేట, మే 8: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైన చిలకలపల్లిలో ఇంటింటా సర్వే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. అందులో భాగంగా చిలకలపల్లితో పాటు బలిజిపేట, పలగర గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సమీప గ్రామాలైన జనార్దనవలస, వెంగళరాయపురం, నూకలవాడ, నారాయణపురం, పెదపెంకి, వెంగాపురం, తుమరాడ, మిర్తివలస, చెల్లింపేట తదితర గ్రామాలను బఫర్‌ జోన్‌గా ప్రకటించారు.


వాహనాల రాకపోకలను నిషేధించారు. కంటైన్మెంట్‌ జోన్‌లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. వలంటీర్లతో నిత్యావసరాల పంపిణీ చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటా సర్వేతో పాటు నిర్థారణ పరీక్షలు ముమ్మరంగా చేపడుతోంది. చిలకలపల్లిలో గురువారం 89 మందికి, శుక్రవారం 109 మందికి పరీక్షలు చేసింది.  పలగర, బలిజిపేటలో ఇంటింటా సర్వే చేపడుతున్నారు. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీస్‌ శాఖ చెక్‌పోస్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేసింది. 

Updated Date - 2020-05-09T09:29:52+05:30 IST