ఏనుగుల దాడిలో ఆవు, దూడ మృతి
ABN , First Publish Date - 2020-12-07T15:59:46+05:30 IST
జిల్లాలోని కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఆవు దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది.

విజయనగరం: జిల్లాలోని కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో ఆవు, దూడపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆవు, దూడ మృతి చెందాయి. గ్రామాలపై పడి ఏనుగుల గుంపు వరుసగా దాడులు చేయడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.