గ్రామాల్లో పశువైద్య శిబిరాలు

ABN , First Publish Date - 2020-12-27T05:39:05+05:30 IST

ఇటీవల కాలంగా మండలంలో వరుసుగా పశువులు మృతి చెందుతున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘పశువుల మృత్యువాత..’ శీర్షికతో ప్రచుతమైన కథనానికి పశువైద్యాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో డెంకాడ పశువైద్యాధికారి కొల్లి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డెంకాడ, పినతాడివాడ, పెదతాడివాడ, గుణుపూరుపేట గ్రామాల్లో శనివారం పశువైద్య శిబిరాలు నిర్వహించారు.

గ్రామాల్లో పశువైద్య శిబిరాలు
పశువులను పరిశీలిస్తున్న పశు వైద్యాధికారులు

డెంకాడ : ఇటీవల కాలంగా మండలంలో వరుసుగా పశువులు మృతి చెందుతున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘పశువుల మృత్యువాత..’ శీర్షికతో ప్రచుతమైన కథనానికి పశువైద్యాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో డెంకాడ పశువైద్యాధికారి కొల్లి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డెంకాడ, పినతాడివాడ, పెదతాడివాడ, గుణుపూరుపేట గ్రామాల్లో శనివారం పశువైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో జిల్లా పశువ్యాధి నిర్థారణ, పరిశోధనశాల వైద్యాధికారిణి లలిత, భోగాపురం పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు మహాపాత్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న పశువులను పరిశీలించి, రక్త నమూనాలు సేకరించారు. రిపోర్టులు ఆధారంగా చికిత్స అందించనున్నట్టు వారు తెలిపారు. 

 

Updated Date - 2020-12-27T05:39:05+05:30 IST