-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Vehicle auction on the 30th
-
30న వాహనాల వేలం
ABN , First Publish Date - 2020-12-27T05:33:54+05:30 IST
వాహన తనిఖీల్లో పట్టుబడిన కొన్ని వాహనాలకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఈనెల 30న వేలం పాట నిర్వహిస్తున్నట్టు రవాణాశాఖ ఉప కమిషనర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కేఎల్ పురంలోని ఆర్‌టీవో కార్యాలయం వద్దకు హాజరుకావాలని కోరారు.

విజయనగరం క్రైం, డిసెంబరు 26: వాహన తనిఖీల్లో పట్టుబడిన కొన్ని వాహనాలకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఈనెల 30న వేలం పాట నిర్వహిస్తున్నట్టు రవాణాశాఖ ఉప కమిషనర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కేఎల్ పురంలోని ఆర్‌టీవో కార్యాలయం వద్దకు హాజరుకావాలని కోరారు. వేలంపాటలో పాల్గొనదలిచిన వారు ఈ నెల 30లోగా రూ.5 వేల డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఎస్‌ఆర్‌టీఏ, విజయనగరం పేరిట తీయాలన్నారు. గడువు అనంతరం ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబోమని పేర్కొన్నారు. దరఖాస్తు ఇచ్చి గైర్హాజరైతే వారికి డిమాండ్ డ్రాఫ్ట్‌లు తిరిగి ఇవ్వమని పేర్కొన్నారు.