మహిళా మిత్ర సేవలు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-14T04:58:09+05:30 IST

ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను మెరుగుపర్చు కునేందుకు మహిళా మిత్ర సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి సూచించారు.

మహిళా మిత్ర సేవలు వినియోగించుకోవాలి

 సిబ్బందికి ఎస్పీ  సూచన

 విజయనగరం క్రైం : ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను మెరుగుపర్చు కునేందుకు మహిళా మిత్ర సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి  సూచించారు. ఆదివారం జిల్లాలోని పోలీసు అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మహిళా మిత్రల సహకా రంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వారాంతపు, మాసాంతపు సమావేశాలు నిర్వహించి విధులపై అవగాహన కల్పించాలన్నారు.  గ్రామ స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలగించే విషయాలు, ఇతర పోలీసు సేవలను వివరించాలని ఆదేశించారు.  ఆపద సమయంలో చేయాల్సిన  100, 112, వాట్సాప్‌ 63098 98989 నెంబర్ల గురించి తెలియజేయాలని సూచించారు.  యువతలను సోషల్‌ మీడియాపై ఆకర్షితులు కాకుండా  తల్లితండ్రులను అప్రమత్తం చేయాలన్నారు. దత్తత తీసుకున్న పాఠాశాలకు వెళ్లి  కరపత్రాలు, లఘచిత్రాల ద్వారా దిశ యాప్‌, చట్టం గురించి తెలియజేయాలన్నారు. 

 

Updated Date - 2020-12-14T04:58:09+05:30 IST