రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-08T05:08:07+05:30 IST

బైకుపై వెళ్తున్న భార్యభర్తలు ప్రమాదానికి గురై గాయాలపాలైన సంఘటన మండలంలోని కారాడ సమీపంలో శనివారం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

బొబ్బిలి:

బైకుపై వెళ్తున్న భార్యభర్తలు ప్రమాదానికి గురై గాయాలపాలైన సంఘటన మండలంలోని కారాడ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. బలిజి పేట మండలం తుమరాడ గ్రామానికి చెందిన జాగాన భానుమూర్తి,  దాలమ్మ దంపతులు శనివారం బైకుపై వెళ్తుండగా, కారాడ సమీపానికి వచ్చేసరికి ఎదురు గా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ గాయపడ్డారు. భానుమూ ర్తికి కాలు విరిగిపోవడంతో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం విజయనగరం ఆసుపత్రికి తరలించినట్టు స్థానిక ఏఎస్‌ఐ పెంటయ్య తెలిపారు.

 

Updated Date - 2020-11-08T05:08:07+05:30 IST