పీటీసీ రిటైర్డు ప్రిన్సిపాల్‌కి సత్కారం

ABN , First Publish Date - 2020-09-25T10:55:48+05:30 IST

పీటీసీ రిటైర్డు ప్రిన్సిపాల్‌కి సత్కారం

పీటీసీ రిటైర్డు ప్రిన్సిపాల్‌కి సత్కారం

విజయనగరం క్రైం : పోలీసు శిక్షణ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్‌ కె.రాజ శిఖామణిని గురువారం పోలీసు శిక్షణ కళాశాలలో ఘనంగా సత్కరించారు. రష్యాలోని ఎల్‌బ్రోస్‌  పర్వ త శిఖరాలను అధిరోహిం చిన తొలి రిటైర్డు పోలీసు అధికారిగా గుర్తింపు పొందడంపై ఈ సందర్భంగా ఆయన్ని సన్మానించారు. 62 ఏళ్ల వయస్సులో ఈ ఘనతను సాధించి... హై రేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు స్థానంలో సంపాదించారు. కార్యక్రమంలో పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ మెహర్‌బాబు, గుంటూరు విజేత విద్యా సంస్థల అధినేత బీఏ రావు, మార్షల్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాళ్ల మహేష్‌, రాజు, నరవ సతీష్‌, సముద్రాల రామారావు తదితరులు  పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-25T10:55:48+05:30 IST