గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలతో మరింత అభివృద్ధి

ABN , First Publish Date - 2020-05-17T10:46:02+05:30 IST

గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు

గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాలతో మరింత అభివృద్ధి

కురుపాం, మే 16: గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందుతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం   టేకరిఖండి ప్రాంతంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గిరిజనుల   ఇంజనీరింగ్‌ కళాశాల కోసం ఈ నియోజకవర్గానికి కేటాయించడం ద్వారా సీఎం జగన్‌కు ఈ ప్రాంతంపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు.   వీలైనంత త్వరగా కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు  తెలిపారు.   వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, ఐటీడీఏ పీవో, ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఉన్నారు.


అన్నదాతను ఆదుకుంటాం... 

జియ్యమ్మవలస : అన్నదాతను అన్నివిధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. చినమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పార్టీలకు ఆతీతంగా ప్రభుత్వ పథకాలను రైతులకు అందిచాలన్నారు. రైతు భరోసా,  ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, విత్తనాల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 2.74 లక్షల మంది రైతులకు రైతుభరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చినట్టు తెలిపారు.  


స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి

గరుగుబిల్లి : స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. పట్టణంలోని కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఆమె పర్యటించారు. కరోనా నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కరోనా వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటు న్నామని, ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు.  స్వీయ నిర్బంధంతో పాటు భౌతిక దూరం పాటించి, మాస్కులు  ధరించాలని సూచించారు. గ్రామాలకు వలస కూలీలు వస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.   ఏఎస్పీ బిందు మాధవ్‌, తహసీల్దార్‌ సన్యాసిశర్మ, ఎంపీడీవో గిరిబాల ఉన్నారు.

Updated Date - 2020-05-17T10:46:02+05:30 IST