-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Trains canceled from today
-
నేటి నుంచి రైళ్లు రద్దు
ABN , First Publish Date - 2020-03-23T09:42:34+05:30 IST
విజయనగరం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు అన్నీ రద్దయ్యాయి. పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల

బాబామెట్ట(విజయనగరం), మార్చి 22: విజయనగరం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు అన్నీ రద్దయ్యాయి. పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకను సోమవారం నుంచి రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి విజయనగరం మీదుగా హౌరా వైపు, అలాగే రాయగడ వైపు వెళ్లే పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు మొత్తం 70 సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉండగా ఆది వారం విజయనగరం మీదుగా మూడు ట్రైన్లు మాత్ర మే తిరిగాయి. ధన్‌బాద్-అలెప్పీ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.21కు, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 5.12కు, సమతా ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 4.56కు విజయనగరం మీదుగా నడిచాయి.
అలాగే ముంబాయి నుంచి భవనేశ్వర్ వెళ్లే ట్రైన్ రాత్రి 10.15కు, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.30కు విజయనగరం మీదుగా వెళ్లాయి. సోమవారం నుంచి మొత్తం పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ ఆగిపోనున్నాయి. ఈ రద్దు ఆదేశాలు ఈనెల 31వరకు ఉంటాయని స్టేషన్ మాస్టర్ తెలిపారు. రైళ్లు రద్దు కావటంతో ఇప్పటికే రిజర్వేషన్లు చేయించుకున్న వారికి తిరిగి డబ్బులు చెల్లించనున్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐలు బీఎస్ రావు, బిఆర్ రావులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తున్నారు.