నీటి యాజమాన్యంపై రైతులకు శిక్షణ
ABN , First Publish Date - 2020-11-14T04:57:32+05:30 IST
ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవశాయ పరివర్తన పథకంలో భా గంగా జిల్లా నీటి యాజమాన్య శాఖ సౌజన్యంతో జామి మండలంలోని చింతాడ రాముడుబండ, నమశ్శివాయ ఆయకట్టు రైతులకు సాగునీటి నిర్వహణపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
శృంగవరపుకోట రూరల్(జామి): ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవశాయ పరివర్తన పథకంలో భా గంగా జిల్లా నీటి యాజమాన్య శాఖ సౌజన్యంతో జామి మండలంలోని చింతాడ రాముడుబండ, నమశ్శివాయ ఆయకట్టు రైతులకు సాగునీటి నిర్వహణపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో జిల్లా జలవనరులు, జలగణన ఉపసంచాలకులు కె.ఎస్.శాస్ర్తి మాట్లాడుతూ వ్యవశాయంలో సాగునీటి వినియోగంపై రైతులకు మెలకువలు తెలియజేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. నీటి అవసరాన్ని ఏఏ సమయంలో తగ్గించుకోవాలనే అంశాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, రాయితీలను వివరించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏడీ లక్ష్మీ, ఐఐఏటీ ఏడీ సత్యనారాయణ, జిల్లా భూగర్భ జలశాఖ ఏడీ రమణమూర్తి, ఆర్‌పీ శంకర్‌రావు, డైరెక్టర్ పి.కె.ప్రకాష్, వరహాలమ్మ తదితరులు పాల్గొన్నారు.