సమస్యల పరిష్కారంలో టాప్
ABN , First Publish Date - 2020-02-08T10:52:12+05:30 IST
స్పందనకు వచ్చిన సమ స్యలను పరిష్కరించడంలో విజయ నగరం జిల్లా రాష్ట్రంలో

ఇన్‌చార్జ్ డీపీవో సునీల్‌రాజ్‌కుమార్
విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 7: స్పందనకు వచ్చిన సమ స్యలను పరిష్కరించడంలో విజయ నగరం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా ఇన్‌చార్జ్ పంచాయతీ అధికారి పి.సునీల్ రాజ్‌కుమార్ చెప్పారు. ఇది అందరి సమష్టి కృషివల్లే సాధ్యపడింద న్నారు. శుక్రవారం ఆయన తన కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. సచి వాలయాల ద్వారా పూర్తిస్థాయిలో సేవ లు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సచివాలయ వ్యవస్థను మ రింత బలోపేతం చేస్తామన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలోనే ప్ర భుత్వ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయని చెప్పారు. అడంగల్, లింక్ డాక్యుమెంట్లకు సంబందించిన పూర్తిసేవలు సచివాలయాల్లో అందిస్తు న్నామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని వసుతులూ కల్పిస్తున్నామన్నారు. ఫర్నిచర్ కొనుగోలుకు రూ.11 కోట్లు ఖర్చుచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా లో 664 సచివాలయాకు గాను 545 భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు.