మీడియాపై దాడి చేసిన వారిని శిక్షించాలి

ABN , First Publish Date - 2020-05-11T10:59:36+05:30 IST

ఓ టీవీ చానల్‌ కేంద్ర కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని బొబ్బిలి జర్నలిస్టుల ఐక్యవేదిక

మీడియాపై దాడి చేసిన వారిని శిక్షించాలి

బొబ్బిలి, మే 10: ఓ టీవీ చానల్‌ కేంద్ర కార్యాలయంపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని బొబ్బిలి జర్నలిస్టుల ఐక్యవేదిక ఖండించింది. ఈ మేరకు ఆదివారం జర్నలిస్టులు, రాజకీయపార్టీల ప్రతినిధులు ,ప్రజాసంఘాలు పట్టణంలో ప్లకార్డులు పట్టుకొని నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 


ఈ  ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మీడి యాపై ఇటువంటి దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని  కోరారు. వేదిక ప్రతినిధి రుంకాన రమేష్‌ ఆధ్వర్యంలో జరిగిన  కార్యక్రమంలో టీడీపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలకు చెందిన నాయకులు రాంబార్కి శరత్‌, రెడ్డి వేణు, ఒమ్మి రమణ, , యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు  విజయ గౌరి, ఏపీటీఎఫ్‌ నేత జేసీ రాజు, రవిశంకర్‌,  సీఐటీయూ, ఐద్వా నాయకులు పొట్నూరు శంకరరావు, వి.ఇందిర, గోపాలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T10:59:36+05:30 IST