-
-
Home » Andhra Pradesh » Vizianagaram » There is no room for corruption in the granting of degrees
-
పట్టాల మంజూరులో అవినీతికి తావులేదు
ABN , First Publish Date - 2020-12-16T05:29:24+05:30 IST
ఎస్‌కోట మండలంలోని 3వేల 837 మందికి ఇళ్లపట్టాలు అందించే చక్కటి కార్యక్రమంతో పాటు గృహనిర్మాణ శంకు స్థాపన కార్యక్రమాలను ఈనెల 25న చేపడుతున్నట్లు ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు.

శృంగవరపుకోట రూరల్, డిసెంబరు 15: ఎస్‌కోట మండలంలోని 3వేల 837 మందికి ఇళ్లపట్టాలు అందించే చక్కటి కార్యక్రమంతో పాటు గృహనిర్మాణ శంకు స్థాపన కార్యక్రమాలను ఈనెల 25న చేపడుతున్నట్లు ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని గౌరిపురంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే, గృహనిర్మాణశాఖ డీఈ శ్రీనివాసన్‌తో కలిసి మాట్లా డారు. ఈ ఇళ్లపట్టాలు మంజూరులో అధికారులైనా, నాయకులైనా అక్రమాలకు, లంచాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడమని హెచ్చ రించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్రకార్యదర్శి ఇందుకూరి రఘురాజు, కృష్ణమహంతి పురం పీఏసీఎస్ అధ్యక్షుడు ఇందుకూరి రామరాజు, మాజీ ఎంపీపీ ఒంటి అప్పా రావు, హౌసింగ్ ఏఈ రామచంద్రరావు, వర్క్ ఇన్ స్పెక్టర్ శ్రీను తదితరులు ఉన్నారు. ఫ రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి ఆర్థికపరిపుష్టి సాధించాలని తద్వారా వ్యవసాయాన్ని పండుగలా మార్చుకోవాలని ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండలంలోని భవానీనగర్ గ్రామం వద్ద సేం ద్రియ బెల్లం తయారీ రైతు సన్యాసినాయుడు వ్యవసాయక్షేత్రంలో ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఏర్పాటుచేసిన సమావేఽశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. గత మూడేళ్లుగా ఆరోగ్యకరమైన సేంద్రియ బెల్లంతో పాటు వాటి ఉత్పత్తు లు తయారుచేస్తున్న సన్యాసినాయుడును, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు జగన్నాథరరావు, శ్రీదేవి, హనుమంతురావులను అభినందించారు.