వ్యవసాయానికి లాక్‌ లేదు...

ABN , First Publish Date - 2020-04-08T12:17:53+05:30 IST

వ్యవసాయ పనులకు వెళ్లే వారికి కరోనా లాక్‌డౌన్‌ నుంచి కాస్తా విముక్తి లభించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట

వ్యవసాయానికి లాక్‌ లేదు...

మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనుమతి

 జీవో నెంబర్‌ 53 విడుదల చేసిన ప్రభుత్వం

భౌతిక దూరాన్ని పాటించాలని సూచన


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనులకు వెళ్లే వారికి కరోనా లాక్‌డౌన్‌ నుంచి కాస్తా విముక్తి లభించింది. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొలం పనులకు వెళ్లవచ్చు. నిబంధనల ప్రకారం భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో నెంబర్‌ 53 విడుదల చేసింది. స్వీయ నిర్బంధం మాదిరిగానే భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యవసాయ పనులు చేయాలని స్పష్టం చేశారు. 


వ్యవసాయాధికారుల సూచన మేరకు బుధవారం నుంచి రైతులు పొలం పనులకు వెళ్లవచ్చు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ పనులకు కూడా వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొందరు వెళ్తున్నా పంటలను పరిశీలించి తిరిగి 11 గంటలకు ఇళ్లకు వచ్చేస్తున్నారు.  ఇక నుంచి అధికారికంగా వ్యవసాయ పనులకు అనుమతిస్తారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ మధ్యాహ్నం ఒంటగి గంట వరకు మాత్రమే పనులు చేయాలి. తరువాత ఇళ్లకు రావాలి. సమయం దాటి ఎవరైనా పనిచేస్తే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లాక్‌ డౌన్‌ కారణంగా వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలుగా ఉన్న పండ్ల తోటలు, కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయి.


ఈ పరిస్థితిలో వ్యవసాయ పనులకు కొంత వెసులుబాటిచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని జిల్లా అగ్రి కల్చర్‌ అధికారి జేడీ అశాదేవి వద్ద ప్రస్తవించగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఇచ్చారన్నారు. ఇందుకు 53జీఓ వచ్చినట్లు స్పష్టం చేశారు. రైతులు పొలంలో భౌతిక దూరాన్ని పాటించాలని, మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. 

Updated Date - 2020-04-08T12:17:53+05:30 IST