-
-
Home » Andhra Pradesh » Vizianagaram » The path shown by Ambedkar is ideal
-
అంబేడ్కర్ చూపిన మార్గం ఆదర్శనీయం
ABN , First Publish Date - 2020-12-07T03:43:49+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని ఎస్పీ రాజకుమారి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

ఎస్పీ రాజకుమారి
విజయనగరం క్రైం, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని ఎస్పీ రాజకుమారి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని డాక్టరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, సమసమాజ నిర్మాణానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వినియోగించుకుంటూ ప్రజలంతా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. పోలీసు స్టేషనకు వచ్చే ప్రజల కుల, మత, వర్గ వివక్ష లేకుండా అందరికీ సమన్యాయం అందేలా రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శేషాద్రీ, సీఐలు రాంబాబు, రుద్రశేఖర్, జె.మురళీ, పీఎస్ మంగవేణి, ఆర్‌ఐలు నాగేశ్వరరావు, చిరంజీవిరావు, టీఎం రాజు తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుల సేవలు అభినందనీయం
పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని, వారి సేవలు అభినందనీయమని ఎస్పీ రాజకుమారి కొనియాడారు. 58వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సదస్సు నిర్వహించారు. హోంగార్డుల సమస్యలు అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించారు. అనంతరం ఎస్‌పీ మాట్లాడుతూ పోలీసులు నిర్వహించే బందోబస్తు, ట్రాఫిక్, డ్రైవింగ్, క్రైం, ఏసీబీ, ఇంటిలిజెన్స, విజిలెన్సు విభాగాల్లో హోంగార్డులు కూడా సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, హోంగార్డుల ఇనచార్జి ఆర్‌ఐ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆర్‌అండ్‌బీ జంక్షన వరకూ ర్యాలీ నిర్వహించారు.