-
-
Home » Andhra Pradesh » Vizianagaram » The MR college should be taken over by the government
-
ఎంఆర్ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-31T05:25:04+05:30 IST
నగరంలోని మహారాజ కళాశాలను ప్రభు త్వం స్వాధీనం చేసుకుని అడ్మిషన్లు చేపట్టాలని బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

కలెక్టరేట్ :నగరంలోని మహారాజ కళాశాలను ప్రభు త్వం స్వాధీనం చేసుకుని అడ్మిషన్లు చేపట్టాలని బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కోట జంక్షన్ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి... అక్కడి నుంచి సీఎం జగన్‌ను కలిసి వినతి పత్రం అంద జేయడానికి విద్యార్థులు బయలు దేరగా... వీరిని పోలీసులు అడ్డుకు న్నారు. ఈ క్రమంలో 40 మంది విద్యార్థులను పోలీసులు ఆరెస్టు చేశారు. దీంతో సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘ నాయకులు రామ్మోహన్, వెంకటేష్, రాము, పావని తదితరులు పాల్గొన్నారు.