శంకుస్థాపన చేసిన ఆస్పత్రికే మళ్లీ..?

ABN , First Publish Date - 2020-12-26T05:36:27+05:30 IST

సాలూరు సీహెచ్‌సీని వందపడకలు గా మారుస్తూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేయగా, మళ్లీ అదే కార్యక్రమం రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేయడం హాస్యాస్పదంగా ఉందని పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీ భంజ్‌దేవ్‌ అన్నారు.

శంకుస్థాపన చేసిన ఆస్పత్రికే మళ్లీ..?
అప్పటి శిలాఫలకం చూపుతున్న భంజ్‌దేవ్‌, టీడీపీ నేతలు

 టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భంజ్‌దేవ్‌ 

సాలూరు రూరల్‌, డిసెంబరు 25: సాలూరు సీహెచ్‌సీని వందపడకలు గా మారుస్తూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేయగా, మళ్లీ అదే కార్యక్రమం రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేయడం హాస్యాస్పదంగా ఉందని పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్పీ భంజ్‌దేవ్‌ అన్నారు. ఆయన టీడీపీ నేతలతో కలిసి శుక్రవారం నాటి శంకుస్థాపన శిలాఫలకాలను మీడియాకు చూపించారు. ఈసందర్భంగా భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 9న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వర్చువల్‌గా, అదేనెల 15న ఆనాటి రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావులు స్వయంగా భూమిపూజ, శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికీ నాటి అభివృద్ధి కార్యక్రమాలే పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్టిక్కర్‌ సీఎం, స్టిక్కర్‌ ప్రభుత్వం ఉందన్నారు. గుమడాం లేఅవుట్‌లో స్థల సేకరణ లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయన విమర్శించారు. అధిక ధరకు భూసేకరణ చేసినా వాస్తవంగా పూర్తి సొమ్ము రైతులకు అందలేదన్నారు. కార్యక్ర మంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, అర్బన్‌ బ్యాంకు అధ్యక్షు డు కూనిశెట్టి భీమారావు, గాడి శ్రీరాములు, బలగ పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-26T05:36:27+05:30 IST