అవినీతిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ABN , First Publish Date - 2020-06-25T11:43:15+05:30 IST
రాష్ట్రంలో 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలులో రూ.307 కోట్ల కుంభకోణం జరగడమే కాకుండా విజయసా యిరెడ్డి అల్లుడి కంపెనీ

అదితీ గజపతిరాజు
విజయనగరం టౌన్, జూన్ 24: రాష్ట్రంలో 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలులో రూ.307 కోట్ల కుంభకోణం జరగడమే కాకుండా విజయసా యిరెడ్డి అల్లుడి కంపెనీ అరబిందోకు 108ల నిర్వ హణ అప్పగించడంలో ఆంతర్యమేమిటో రాష్ట్ర ప్రభు త్వం ప్రజలకు చెప్పాల్సి ఉందని విజయనగరం ని యోజకవర్గ ఇంచార్జ్ పూసపాటి అదితీ గజపతిరాజు అన్నారు. బుధవారం నగరంలోని అశోక్‌బంగ్లాలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లా డుతూ 2017 నుంచి 2020 వరకూ బీవీజీ సంస్థకు ఒప్పందం ఉన్నప్పటికీ అర్థాంతరంగా రద్దుచేసి అర బిందోకు అప్పగించడంలో అవినీతి దాగి ఉంద న్నారు.
జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిలోనే జగన్ ప్రభుత్వం చీకటి జీవోలతో పాల న చేయడమే కాకుండా ప్రజాధనం వృథా చేస్తోం దన్నారు. జిల్లా కార్యదర్శి ఐ.వి.పి రాజు మాట్లా డుతూ నేడు వైసీపీ ప్రభుత్వం శవాలమీద గుడ్డలు ఏరుకునే దశకు చేరుకుందన్నారు.
ఈనెల 26న మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు 70వ జన్మదిన వేడుకలను పురస్కరిం చుకుని అభిమానులు ఎవ్వరూ నేరుగా వచ్చి అభిన ందనలు చెప్పవద్దని, కేవలం సోషల్‌మీడియా, లేక ఫోన్‌ల ద్వారా తెలపాలని కోరారు. కార్యక్రమంలో జి ల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు బొద్దుల న రసింగరావు, మండల జడ్పీటీసీ అభ్యర్థి గంటా పోలినాయుడు, కర్రోతు నరసింగరావు, కనకల మురళీ మోహన్, గొలగాని సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.