ప్రజా పోరాటాలే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-27T05:41:38+05:30 IST

ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు వెళ్దామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ అన్నారు. సీపీఐ 95వ వ్యవస్థాపక అవిర్భావ దినోత్సవాన్ని శనివారం నగరంలోని మాక్స్‌ నగర్‌, బలిజివీధి, శాంతినగర్‌ ప్రాంతాల్లో నిర్వహించారు.

ప్రజా పోరాటాలే లక్ష్యం
ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్‌ 

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 26: ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు వెళ్దామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ అన్నారు. సీపీఐ 95వ వ్యవస్థాపక అవిర్భావ దినోత్సవాన్ని శనివారం నగరంలోని మాక్స్‌ నగర్‌, బలిజివీధి, శాంతినగర్‌ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ, 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో సీపీఐ అవిర్భవించిందన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తిండి, బట్ట, గూడు , వైద్యం, విద్య, కనీస అవసరాల కోసం మడమ తిప్పని పోరాటాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జగన్నాధం, జీవన్‌, అప్పలరాజు, గౌరీశంకర్‌, రాజేష్‌, సునీల్‌, సతీష్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:41:38+05:30 IST