నేటి నుంచి ప్రైవేటు ఆలయాల మూసివేత

ABN , First Publish Date - 2020-03-24T08:12:32+05:30 IST

కరోనా వైరస్‌ కారణంగా మంగళవారం నుంచి ప్రైవేటు ఆలయాలు కూడా మూసి వేస్తున్నట్టు

నేటి నుంచి ప్రైవేటు ఆలయాల మూసివేత

శృంగవరపుకోట రూరల్‌, మార్చి 23: కరోనా వైరస్‌ కారణంగా మంగళవారం నుంచి ప్రైవేటు ఆలయాలు కూడా మూసి వేస్తున్నట్టు ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ వైవీ రమణి నిర్వాహకులకు ఆదేశించారు. సోమవారం ధర్మవరం సన్యాసేశ్వర ఆలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాలు మూసేశామని, దేవదాయ శాఖ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్న చిన్న ఆలయాలు కూడా మూసేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భళ్లమూడి శ్రీనివాసరావు ఉన్నారు. 

Read more