ఉపనిషత్తుల సారమే భగవద్గీత

ABN , First Publish Date - 2020-12-25T05:49:02+05:30 IST

ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సాయి సంగత్స వ్యవస్థాపకుడు ఉపదృష్ట వరప్రసాద్‌ తెలిపారు.

ఉపనిషత్తుల సారమే భగవద్గీత
విజయ నగరం రూరల్‌: గీత జయంతి సందర్భంగా జ్ఞానోదయ స్కూల్‌లో

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 24: ఉపనిషత్తుల సారమే  భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సాయి సంగత్స వ్యవస్థాపకుడు ఉపదృష్ట వరప్రసాద్‌ తెలిపారు.  గీతా జయంతిని పురస్కరించుకుని  కొత్తఆగ్రహరంలోని గీతాంజలి పాఠశాలలో ఆయన  మాట్లాడుతూ .. భగవద్గీత భార తీయ జీవన వేదమన్నారు.  మనో వైద్య గ్రంథంగా ఉపయోగపడు తుందన్నారు. అనంతరం ఆయన్ని సత్కరించారు. భారత్‌ వికాస్‌ పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో   ప్రతినిధులు సముద్రాల గురుప్రసాద్‌, గీతాంజలి శ్రీనివాస్‌, సుభద్రా దేవి తదితరులు పాల్గొన్నారు.    విజయ నగరం రూరల్‌: గీతాజయంతిని పురస్కరించుకుని నగరంలోని పాత బస్టాండ్‌ సమీపంలో ఉన్న జ్ఞానోదయ స్కూల్‌లో గురువారం ప్రత్యేక కార్యక్ర మం నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంఘ సభ్యుడు మక్కువ చంద్రకళాధర్‌ గీతాజయంతిపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.  అనంతరం పాఠశాల ప్రాంగ ణంలో చార్ట్‌లపై రూపొందించిన భగవద్గీత పుస్తకం అందర్నీ ఆకట్టు కుంది. ఈ కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్‌ మధుసూదనరావు తదిత రులు పాల్గొన్నారు.    చీపురుపల్లి: పట్టణంలోని గీతా మంది రంలో శుక్రవారం గీతా జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా  గీతా పారాయణం, దార్లపూడి మురళీ నరసింహశర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని వారు చెప్పారు. 


 

 

Updated Date - 2020-12-25T05:49:02+05:30 IST