-
-
Home » Andhra Pradesh » Vizianagaram » The arrests of food donors are unjust
-
అన్నదాతల అరెస్టులు అన్యాయం
ABN , First Publish Date - 2020-11-28T04:58:55+05:30 IST
వ్యవసాయ చట్టాల రద్దును కోరు తూ ఢిల్లీ ఆందోళనకు వెళ్లిన రైతులను అరెస్టు చేయడం అన్యాయమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ అన్నారు.

శృంగవరపుకోట, నవంబరు 27: వ్యవసాయ చట్టాల రద్దును కోరు తూ ఢిల్లీ ఆందోళనకు వెళ్లిన రైతులను అరెస్టు చేయడం అన్యాయమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ అన్నారు. స్థానిక పోస్టల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన రైతులతో కలిసి నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు, సీఐటీయూ జిల్లా కార్య దర్శి మద్దిల రమణ పాల్గొన్నారు.
బొబ్బిలి: వ్యవసాయ బిల్లు, విద్యుత్ చట్టసవరణ, కేంద్రవిధానాలను నిరసనగా రైతులు చేపట్టిన చలో పార్లమెం ట్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు, రైతుసంఘం, వ్యవసాయ కార్మికసంఘం, నాయకులు శంకర రావు, ప్రసాద్, సాంబయ్య, తిరుపతిరావు, గోపాలం రామకృష్ణ, డీవైఎఫ్‌ఐ నాయకులు సురేష్ పాల్గొన్నారు.