-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Tenth tests postponed again
-
టెన్త్ పరీక్షలు మళ్లీ వాయిదా
ABN , First Publish Date - 2020-03-25T11:39:27+05:30 IST
కరోనా వైరస్ ప్రభావంతో మరోమారు పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవంగా ఈ నెల 23 నుంచి

కరోనా వైరస్ ప్రబలకూడదని చర్యలు
రెండువారాల తరువాత షెడ్యూల్ విడుదల
విజయనగరం(ఆంధ్రజ్యోతి)మార్చి 24 : కరోనా వైరస్ ప్రభావంతో మరోమారు పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. వాస్తవంగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. తొలుత స్థానిక ఎన్నికల కారణంగా ఈ నెల 31కి వాయిదా పడ్డాయి. ఇంతలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోండడంతో ఏ విద్యార్థీ ఆ మహమ్మారి బారిన పడకూడదని ప్రభుత్వం పరీక్షలను మళ్లీ వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎ.సురేష్ మంగళవారం ఆమరావతిలో ప్రకటించారు. లాక్‌డౌన్‌తో హాస్టల్స్‌కు కూడా సెలవు ప్రకటిం చారు. విద్యార్థులంతా వారి స్వగ్రామాలకు చేరుకున్నారు.
తిరిగి పరీక్ష కేంద్రాలకు చేరలేని పరిస్థితి ఉంది. రవాణా సదుపాయాలు స్తంభించిన కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ కారణంతోనే పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఇదే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.నాగమణి కూడా మంగళవారం ధ్రువీకరించారు. ఎప్పుడు నిర్వహించేదీ ప్రభుత్వమే మళ్లీ షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి మొదటి సెట్‌పేపర్లు సిద్ధమై ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి.