ఉపాధ్యాయ బదిలీల రీ షెడ్యూల్‌

ABN , First Publish Date - 2020-11-03T05:53:06+05:30 IST

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ చినవీరభద్రుడు సోమవారం జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో మళ్లీ బదిలీల కలవరం మొదలైంది.

ఉపాధ్యాయ బదిలీల రీ షెడ్యూల్‌


బొబ్బిలి, నవంబరు 2:

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి రీ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ చినవీరభద్రుడు సోమవారం జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల్లో మళ్లీ బదిలీల కలవరం మొదలైంది. దశలవారీ షెడ్యూల్‌ ఇలా ఉంది. ఈ నెల 4 నుంచి వచ్చే నెల 14 వరకు మొత్తం 41 రోజులు ఈ ప్రక్రియ కొనసాగేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 4 నుంచి 9 వరకు హేతుబద్ధీకరణ,  10, 12 తేదీల్లో అన్ని పాఠశాలల్లో ఖాళీల ప్రకటన, 12 నుంచి 16 వరకు ఉపాధ్యాయుల నుంచి బదిలీల కోసం దరఖాస్తుల ఆహ్వానం తదితర ప్రక్రియలు ఉంటాయి. 17, 18 తేదీల్లో వాటి పరిశీలన, 19  నుంచి 23 వరకు సీనియారిటీ జాబితా విడుదల, 24 నుంచి 26 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 27 నుంచి 29 వరకు అభ్యంతరాల పరిష్కారం, 30 నుంచి డిసెంబరు 2 వరకు తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. డిసెంబరు 4, 5 తేదీలలో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. డిసెంబరు 6 నుంచి 11 వరకు తుది స్థానాలను ఖరారు చేస్తారు. జాబితా విడుదల... సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం డిసెంబరు 12, 13 తేదీల్లో తుది ఉత్తర్వులు విడుదల చేస్తారు.  డిసెంబరు 14న బదిలీల జాబితా బహిరంగ ప్రకటన ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీర భ ద్రుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా ఉండగా ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కాకుండా మాన్యువల్‌గా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యా సంఘ నాయకులు జేసీ రాజు కోరారు.

 

Updated Date - 2020-11-03T05:53:06+05:30 IST