-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Teacher transfers should be done manually
-
ఉపాధ్యాయ బదీలీలు మాన్యువల్‌గా చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-28T04:50:46+05:30 IST
ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం మాన్యువల్‌గా చేపట్టాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు డిమాండ్ చేశారు.

దాసన్నపేట : ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం మాన్యువల్‌గా చేపట్టాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డి. ఈశ్వరరావు అధ్యకతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పోస్టులను బ్లాక్ చేయకుండా ఉపాధ్యాయ ఖాళీలన్నీ చూపిం చాలన్నారు. మారుమూల పాఠశాలలు మూతపడతాయనుకుంటే బదిలీ అయిన ఉపాఽధ్యాయులకు ప్రత్యామ్నయంగా రిలీవ్ చేయొద్దని తెలిపారు. సమా వేశం అనంతరం డీఈవో కార్యాలయంలో డీఈవో నాగమణి చేతులమీదుగా నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు ధనుంజయ్‌రావు, దామోదర నాయుడు, సత్యారావు, కూర్మారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.