టీడీపీ-వైసీపీ వార్: పరస్పరం కర్రలతో దాడులు

ABN , First Publish Date - 2020-05-29T16:30:12+05:30 IST

జిల్లాలోని గురుగుబిల్లి మండలం దళాయివలసలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

టీడీపీ-వైసీపీ వార్: పరస్పరం కర్రలతో దాడులు

విజయనగరం: జిల్లాలోని గురుగుబిల్లి మండలం దళాయివలసలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెలుగు సంస్థకు సంబంధించి వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) పోస్టు కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. పరిస్థతిని అదుపు చేసిన పోలీసులు... 49మందిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-29T16:30:12+05:30 IST