పన్ను పెంపు జీవోలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-14T04:59:44+05:30 IST
మునిసిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను, తాగునీరు, డ్రైనేజీ చార్జీల పెంపు జీవోలను రద్దు చేయాలని పట్టణ ఫౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

బొబ్బిలి, డిసెంబరు 13: మునిసిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను, తాగునీరు, డ్రైనేజీ చార్జీల పెంపు జీవోలను రద్దు చేయాలని పట్టణ ఫౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే దశలవారీ ఆందోళనలు చేస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదివారం స్థానిక రెడ్డిక వీధిలో నిర్వహించిన సమావేశం అనంతరం తీర్మానం కాపీలను విడుదల చేశారు. క్యాపిటల్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని చేసిన చట్టసవరణను రద్దు చేయాలన్నారు. పౌరసౌకర్యాల నిర్వహణ ఖర్చుల మొత్తాలను యూజర్ చార్జీలుగా వసూలు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. 2022 వరకు ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ ఇవ్వాలని, పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధిపనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తీర్మానం కాపీలను మునిసిపల్ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.చంద్రశేఖర్, బాలతౌడు, చుక్క గౌరీశంకర్, గెంబలి రమణ, దీప తదితరులు పాల్గొన్నారు.